BADVEL: బద్వేల్ లో మైనర్ విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాలికలకు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలికలకు మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తూ తీసుకువచ్చిన “దిశ” కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు. 900 బైకులు 163 బొలెరో వాహనాలను దిశా కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ ను మరింత పటిష్టం చేసాం. వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో దిశా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం. దాంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తమై ఉండేవారు.
Badvel : పెట్రోల్ దాడికి గురైన మైనర్ విద్యార్థిని మృతి…
లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2024
ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుంది. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు బాలికాలకు రక్షణ కరువైంది అనేది మాత్రం వాస్తవం. ఇక ఈ ఘటన పై సీరియస్ గా ఉన్న కూటమి ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తానని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా నిందితుడికి, అతడికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.